e-mail me
NEWS HOMEFLASH NEWSPHOTO NEWSKadapa.info HomeNEWS PAPER

మళ్ళీ కడప జిల్లాలో పుట్టు.. మహానేతా !
 
పులివెందుల పులిబిడ్డ!

కడప జిల్లా ముద్దుబిడ్డ!!

రాయలసీమ రత్నం!

ఆంధ్రుల ఆరాధ్య దైవం!!

 

ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారన్న వార్త ప్రపంచాన్ని దిగ్భ్రమకు గురిచేసింది. జనహృదయ నేత వై.ఎస్.ఆర్ మరణంతో  రాయలసీమ  దుఃఖ సముద్రంలో మునిగిపొయింది. కడప జిల్లా కన్నీటి సాగరమే అయ్యింది. రాష్ట్రంలోని రైతులోకం గుండె ఆగిపొయింది. బడుగు బలహీన, మైనారిటీ  , గిరిజన ప్రజానీకం ఈ దుర్వార్త తో నిలువెళ్ళా బండబారిపోయింది.  ఒకపక్క రాష్త్ర సంక్షేమం కోసం పరితపిస్తూనే ప్రతీ క్షణం రాయలసీమ ప్రజల క్షేమాన్ని కాంక్షించారు, వై.ఎస్.రాజ శేఖర రెడ్డి.  ఎక్కడో  దూరంగా విసిరి వేయబడ్డట్టు అభివృద్ది కి నోచుకోకుండా అనామకంగా పడివుండిన కడప జిల్లా కు దేశపటంలో ఒక గుర్తింపును కలిగించారు. ఎందరు నాయకులు ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని పత్రికలు ఏం రాసినా లెక్కచేయకుండా  కడప జిల్లాకు ప్రాజెక్టులనూ, పరిశ్రమలనూ తెచ్చారు. కడపను ఒక నగరంగా తీర్చిదిద్దారు.

 

 రైతు బాంధవుడిగా రైతులోకంలో చెరగని ముద్ర వేశారు. ఉచిత విద్యుత్ పథకం ద్వారా వ్యవసాయదారులకు చేయూతను ఇచ్చారు.  అపర భగీరధుడిగా అవతరించి సాగునీటి ప్రాజెక్టులను నిర్మించారు. కరువు పీడిత రాయలసీమకు  పోతిరెడ్డిపాడు ద్వారా 45 వేల క్యూసెక్కుల నీటిని మళ్ళించేందుకు కంకణబద్దుడై పని పూర్తి చేశారు.  ఇందిరమ్మ ఇళ్ళు , రేషన్ కార్డులూ అడిగినన్ని పేదలందరికీ మంజూరు చేసారు.   రాయలసీమలోనే కాదు, తెలంగాణా, ఉత్తరాంధ్ర, కొస్తా అన్నిప్రాంతాల్లోనూ అశేష ప్రజల అభిమానాన్ని  చూరగొని వారి హృదయాల్లో నిలిచిన  మహా నాయకుడు అందర్నీ దుఃఖసాగరంలో ముంచి మహాప్రస్థానం చేశారు. పసిపిల్లలకు గుండె చికిత్సలను  చేయించారు. కులాలకూ మతాలకూ అతీతంగా నిరుపేద విద్యార్థులకు ఉపకారవేతనాలను అందించి మానవతను చాటారు. ఒకటీ రెండూ కాదూ ప్రజల అభివృద్దికి వందలాది పథకాలను అమలుచేసిన మడమ తిప్పని యోధుడు,  వై.ఎస్.రాజ శేఖర రెడ్డి. కడప జిల్లాలో పుట్టడం తన అదృష్టంగా, గర్వంగా ప్రకటించుకున్న  కడప ముద్దుబిడ్డ 

 

మళ్లీ మరొక్కసారి కడప జిల్లాలో పుట్టు...మహానేతా!

  

కడప జిల్ల్లా ప్రజల తరపున ఆ మహా ప్రజా నేతకు కడప డాట్ ఇన్ ఫో .(www.kadapa.info) అశృ నివాళి అర్పిస్తోంది.      

YSRR 


KADAPA IS NOW DR.YS RAJASEKHAR REDDY DISTRICT
 

Kadapa: The Andhra Pradesh government has renamed Kadapa district as Dr Y.S. Rajasekhara Reddy district in memory of the former chief minister who died in a helicopter crash last month. The government Monday issued the order renaming Kadapa, the native district of Rajasekhara Reddy.


More Details...

వై‌ఎ‌స్ మరణవార్త విని 300 మంది మృతి
  తెలుగు ప్రజానీకం గుండెల్లో నిలిచిపోయిన ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణవార్త విని రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది ప్రాణాలు విడిచారు. వృద్ధాప్య ఫించన్లు అందుకుంటున్న వాళ్లు, ప్రభుత్వ ఇతర పథకాల లబ్ధిదారులు, వైఎస్‌ను వ్యక్తిగతంగా అభిమానించే వాళ్లు, కాంగ్రెస్ కార్యకర్తలు... ఇలా రకరకాల వ్యక్తులు వీరిలో ఉన్నారు. దిగ్భ్రాంతితో గుండెపోటుకు గురైనవారు కొందరైతే.. ఆత్మహత్యలు చేసుకున్న వారు మరికొందరు. ఇంకొందరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కొనవూపిరితో బయటపడ్డారు. ఆ వివరాలు ...
పూర్తి వివరాలు...

30 ఏళ్లుగా వెంట నడిచిన కడప జిల్లా
 

అవకాశం వచ్చినప్పుడు సొంత నియోజకవర్గాన్ని, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని తపించారు. తాను విపక్షంలో ఉండటంతోపాటు... స్వపక్షంలోనూ విపక్ష తరహా రాజకీయాల్ని అనుసరించినందున జిల్లాలో 20 ఏళ్లపాటు అభివృద్ధి ఆగిపోయిందని భావించే ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాక విమర్శల్నీ లెక్కజేయక జిల్లా అభివృద్ధిపై దృష్టిపెట్టారు. పులివెందుల లాంటి చిన్న పట్టణానికి అవుటర్ రింగ్‌రోడ్డు నిర్మించారంటే అక్కడి అభివృద్ధిపై ఆయన పడిన తపన అర్ధమవుతుంది. రాష్ట్రమంతా తెలుగుదేశం ప్రభంజనం వీచిన సమయంలోనూ, రాజకీయంగా స్వపక్ష, విపక్ష ప్రత్యర్థులు ఎంతటి విషమ పరిస్థితుల్ని సృష్టించినా... ఆయన నమ్ముకున్న ప్రజలు ఎన్నడూ ఆయనకు దూరం కాలేదు. ఎన్నికల పోరులో ఘనవిజయాలు అందించారు. నాలుగు సార్లు లోక్‌సభకు, ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. వైద్యునిగా పులివెందులలో ప్రాక్టీసు చేస్తూ యువజన కాంగ్రెస్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న వైఎస్ అగ్రనేతలతో పాటు తండ్రి వై.ఎస్.రాజారెడ్డి సూచనమేరకు 1978 ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్(ఆర్) తరఫున బరిలో నిలిచి గెలుపొందారు.


మరిన్ని వివరాలు...

దుఃఖసాగరంలో కడప
 

కడప: జిల్లా ముద్దబిడ్డ వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారన్న దుర్వార్త గురువారం చెవిన పడగానే యావత్తు కడప జిల్లా తల్లడిల్లింది. నోటి మాటరాక అందరి హృదయాలు శోకంతో బరువెక్కాయి. పాల పొంగులాంటి పంచెకట్టుతో, కల్మషం లేని చిరునవ్వుతో ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరించే తమ నేత ఇక లేరని తెలిసి తీవ్రంగా కలత చెందారు. కడప నగరంలో భారీ సంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చి చర్చించుకోవడం కనిపించింది. బుధవారం నుంచి ఆచూకీ కన్పించకపోవడంతో ఆయనకు ఎలాంటి కీడు జరక్కూడదని ప్రార్థనాలయాల్లో పెద్ద ఎత్తునా పూజలు చేసినా ఫలించకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క దేవుడైనా కరుణించి వైఎస్ ప్రాణాలు నిలిపి ఉంటే బాగుండేదంటూ వాపోయారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన ప్రజానేత దూరం కావడం కడపకు దురదృష్టకరమంటూ రోదించారు. ...


More Details..

YSR's chopper untraceable
  Andhra Pradesh Finance Minister K. Rosaiah officially broke the news that Chief Minister Y. S. Rajasekhara Reddy’s helicopter remained untraceable and that several helicopters from Hyderabad, Bangalore and Nellore were scouring the Nallamala forest area in the State. Mr. Rosaiah disclosed at a press conference after a meeting with other Ministers, Chief Secretary P. Ramakanth Reddy, Director General of Police S. S. P. Yadav that there was no radio contact with the Chief Minister's party from 9.35 a.m...
More Details..

Search in Nallamala...
 

The search for the missing helicopter is focussed around roughly 300 sq. km. of Nallamala forest in Kurnool and Prakasam districts, a daunting task indeed for the police teams that have fanned out into the thick forest area, once a Maoist stronghold. Large contingents of Grey Hounds, the elite anti-naxalite commando force, have been rushed to Kurnool and Prakasam districts for the search and rescue operations. The commandos are the most competent for the job as they are well-versed with the forest terrain, but inclement weather is ...


More Details...



Copyright © 2009, Tavva Communications. All Rights Reserved.

|NEWS HOME| |FLASH NEWS| |PHOTO NEWS| |Kadapa.info Home| |NEWS PAPER| |gpage|